: టీడీపీ, బీజేపీ స్నేహం వల్లే తెలంగాణలో సమస్యలు: కవిత


తెలంగాణ రాష్ట్రంలోని సమస్యలన్నీ టీడీపీ, బీజేపీల మధ్య ఉన్న స్నేహం వల్లే వస్తున్నాయని టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆరోపించారు. బీజేపీకి టీడీపీ మిత్రపక్షం కావడంతో, తెలంగాణలోనూ ఆ రెండు పార్టీల స్నేహం కొనసాగుతోందని... ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణ ప్రజల మద్దతును బీజేపీ కోల్పోతుందని చెప్పారు. కొన్ని విషయాలలో ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాల పట్ల తమకు కూడా అసంతృప్తి ఉందని అన్నారు. తెలంగాణ సాధన కోసం తపించిన కేసీఆర్ కు తెలంగాణ అభివృద్ధి తప్ప వేరే ధ్యాస లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News