: టీఆర్ఎస్ ఎంపీలు గోడ మీది పిల్లులు... కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ఆరోపణ


టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులపై కరీంనగర్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు విభజనకు సంబంధించిన పోరాటంలో టీఆర్ఎస్ ఎంపీలు... గోడ మీది పిల్లుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆయన కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజన కోసమంటూ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను టీఆర్ఎస్ ఎంపీలు కలిసిన వైనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ను కలిస్తే, హైకోర్టు విభజన సాకారమవుతుందా? అని ఆయన ప్రశ్నించారు. గతంలో తమను దద్దమ్మలన్న కేసీఆర్, గవర్నర్ ను కలిసిన తన ఎంపీలను ఏమంటారని కూడా పొన్నం నిలదీశారు. కేంద్ర మంత్రి పదవి కోసమే కల్వకుంట్ల కవిత అర్రులు చాస్తున్నారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News