: పుష్కరాల తొక్కిసలాట ఘటనపై ఏపీ సర్కారుకు నోటీసులు
రాజమండ్రి పుష్కరాలలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తొక్కిసలాట ఎలా జరిగింది, ప్రమాదానికి కారకులెవరు, ఎలాంటి సహాయచర్యలు తీసుకున్నారంటూ నోటీసుల్లో ప్రశ్నించింది. నోటీసులకు సమాధానం చెబుతూ కౌంటర్ దాఖలు చేయాలని వారం గడువు విధించింది. ఈ ఉదయం న్యాయవాది రఘునందన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. ఈ నెల 14న తొలిరోజు రాజమండ్రి పుష్కర ఘాట్ లో తొక్కిసలాట జరగడంతో 27 మంది చనిపోయిన విషయం విదితమే.