: ప్రత్యూషను మాకు అప్పగించండి... హైకోర్టులో ఓ ఎన్జీవో పిటిషన్


కన్నతండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురైన బాలిక ప్రత్యూషను తమకు అప్పగించమంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రత్యూష యెగక్షేమాలను తామే చూసుకుంటామని తెలిపింది. ఇప్పటికే తమ వద్ద ఇలాంటి పిల్లలు 14 మంది ఉన్నారని కోర్టుకు వివరించింది. కోర్టు ఈ విజ్ఞప్తిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ప్రత్యూష సరూర్ నగర్ లోని గ్లోబల్ అవేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, న్యాయస్థానంలో ఈ విషయంపై విచారణ కూడా జరుగుతోంది.

  • Loading...

More Telugu News