: తలసానిని బర్తరఫ్ చేసి గవర్నర్ పదవి గౌరవాన్ని కాపాడాలి: ఎర్రబెల్లి


ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ అపహాస్యం చేసిందని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు మండిపడ్డారు. తలసానికి మంత్రి పదవి ఇచ్చే క్రమంలో, గవర్నర్ ను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. ఆలుగడ్డల శీనుకు సిగ్గు, శరం లేదని ఎద్దేవా చేశారు. రాజీనామా చేశానని తలసాని చేసిన ప్రకటన అంతా అబద్ధమే అని తేలిపోయిందని అన్నారు. ఈ తప్పుడు పనికి తలసానితో పాటు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారిలు కూడా బాధ్యత వహించాలని చెప్పారు. తప్పుడు పని చేసిన తలసానిని రాజకీయాల నుంచి బహిష్కరించాలని... ఆయనను బర్తరఫ్ చేయడం ద్వారా గవర్నర్ పదవికున్న గౌరవాన్ని నరసింహన్ కాపాడాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News