: సెక్షన్-8పై హైకోర్టులో పిటిషన్... పిటిషనర్ పై కోర్టు ఆగ్రహం


హైదరాబాదులో సెక్షన్-8 అమలు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిల్ ను సీమాంధ్ర గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ లో విచారణకు అర్హమైన అంశాలు లేవని పేర్కొంది. కేసు విచారణ జరపాలంటే నగదు డిపాజిట్ చేయాలని తెలిపింది. విలువైన కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో, పిటిషనర్ తమ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News