: రాజమండ్రి తొక్కిసలాట ఘటనపై హైకోర్టులో పిటిషన్

గోదావరి పుష్కరాల తొలిరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘాట్ లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రఘునందన్ అనే న్యాయవాది ఈ పిటిషన్ ను వేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు ఈ మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది. ఈ నెల 14న అకస్మాత్తుగా జరిగిన తొక్కిసలాటలో 27 మంది మరణించారు. పలువురికి గాయాలైన సంగతి తెలిసిందే.