: సింగపూర్ బృందానికి ఏపీ రెడ్ కార్పెట్ స్వాగతం...లగ్జరీ బస్సును పంపిన కేశినేని నాని


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి బ్లూప్రింట్ తో తెలుగు నేలపై దిగిన సింగపూర్ ప్రతినిధి బృందానికి చంద్రబాబు కేబినెట్ రెడ్ కార్పెట్ పరిచింది. సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలో 30 మందితో కూడిన ఈ బృందం నేటి తెల్లవారుజామున హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండైంది. ఆ తర్వాత హైదరాబాదు నుంచి రాజమండ్రి వెళ్లేందుకు ఈ బృందానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు వెంట ఉండి మరీ వారిని రాజమండ్రి తీసుకెళ్లారు. రాజమండ్రిలో ఈశ్వరన్ బృందానికి ఘన స్వాగతం లభించిందనే చెప్పాలి. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటు కేబినెట్ మంత్రులు సింగపూర్ ప్రతినిధులకు పూలమాలతో ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే, రాజమండ్రి విమానాశ్రయం నుంచి నగరంలోని షెల్టాన్ హోటల్ కు సింగపూర్ ప్రతినిధులు వచ్చేందుకు విజయవాడ ఎంపీ కేశినేని నాని తన అత్యాధునిక బస్సును అక్కడికి పంపారు. అత్యాధునిక హంగులతో కూడిన ఈ బస్సు అందరినీ ఆకట్టుకుంది.

  • Loading...

More Telugu News