: 'ది గాడ్ ఫాదర్' నటుడు అలెక్స్ రోక్కో ఇకలేడు


ప్రముఖ హాలీవుడ్ నటుడు 1970వ దశకంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'ది గాడ్ ఫాదర్' చిత్రంతో పేరు తెచ్చుకున్న అలెక్స్ రోక్కో (79) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. లాస్ ఏంజిలస్ లోని తన నివాసంలో అలెక్స్ కన్నుమూశారని మేనేజర్ సుసాన్ జాచరీ వెల్లడించారు. ఆయన అసలు పేరు అలగ్జాండర్ ఫెడ్రికో పెట్రికోన్ జూనియర్. 1990లో 'ది ఫేమస్ టెడ్డీ జడ్' చిత్రంలో అద్భుత నటన కనబరిచినందుకు ఆయనకు ఎమ్మీ అవార్డు లభించింది. 'ది ఫ్రెండ్స్ ఆఫ్ ఎడ్డీ కూలీ', 'ఫ్రీబీ అండ్ ది బీన్', 'దట్ థింగ్ యూ డూ!', 'ది వెడ్డింగ్ ప్లానర్' వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన 'ఎ బగ్స్ లైఫ్' చిత్రంలో 'థ్రోనీ' (చీమ) పాత్రకు గాత్రదానం చేశారు. ఆయన మృతిపట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News