: సీబీఐ కోర్టుకు హాజరైన గాలి జనార్దన్ రెడ్డి
ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసు నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి ఈరోజు హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కేసుకు సంబంధించిన విచారణ ఉండటంతో, ఆయన కోర్టుకు వచ్చారు. ఆయనతో పాటు సబితా ఇంద్రారెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, కృపానంద, అలీఖాన్, శ్రీలక్ష్మిలు కూడా కోర్టుకు హాజరయ్యారు. కేసును విచారించిన కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది.