: రాజమండ్రి నుంచి ఖమ్మం జిల్లాకు బయలుదేరిన గవర్నర్ దంపతులు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి రాజమండ్రి నుంచి ఖమ్మం జిల్లాకు బయలుదేరి వెళ్లారు. ఆ జిల్లాలోని బూర్గంపాడు మండలం మోతె గ్రామానికి చేరుకుని అక్కడ వారు పుష్కరస్నానం ఆచరిస్తారు. అనంతరం భద్రాచలంలో సీతారాములను గవర్నర్ దంపతులు దర్శించుకుంటారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్న గవర్నర్ దంపతులు గోదావరి వీఐపీ ఘాట్ లో పుష్కర స్నానం ఆచరించిన సంగతి తెలిసిందే.