: ఏపీ రాజధాని 'అమరావతి' మాస్టర్ ప్లాన్ లో ఉన్న ప్రత్యేకతలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. పచ్చటి పరిసరాలు, ఎత్తైన భవంతులు, విశాలమైన రోడ్లు, సువిశాలమైన పార్కులు, హోటళ్లు, కార్యాలయాలు, ఫుడ్ కోర్టులు, ఎమ్యూజ్ మెంట్ పార్కులు,.. ఒకటేమిటి సర్వం పొందుపర్చుకున్న మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ బృందం తమ వెంట తీసుకొచ్చింది. ఈ రోజు ఈ ప్రణాళికను సీఎం చంద్రబాబుకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అధ్యక్షతన విచ్చేసిన బృందం సమర్పించనుంది. మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మాస్టర్ ప్లాన్ లోని హైలైట్స్ ఇవే... * అత్యాధునిక రాజధానిగా అమరావతి * దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల కన్నా అందమైన రాజధాని అమరావతి * 16.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని ప్రధాన కేంద్రం * ఇక్కడ నుంచి మూడు మెట్రో మార్గాల నిర్మాణం * మెట్రోను అనుసంధానం చేసేలా సెమీ ఎక్స్ ప్రెస్ వే... వీటిని కలుపుతూ ఎక్స్ ప్రెస్ వే * పాదచారులకు ప్రత్యేక మార్గం ఏర్పాటు * 212 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మొత్తం రాజధాని నిర్మాణం * నగరాన్ని మార్కెటింగ్ చేయడానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు * జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసేందుకు ఈ యంత్రాంగం పనిచేస్తుంది * కొండవీటి వాగు నీటి వినియోగం కోసం రెండు రిజర్వాయర్ల నిర్మాణం * భవానీ ద్వీపంతో పాటు, ఇతర చిన్నచిన్న ద్వీపాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు * మెరుగైన రవాణా ఏర్పాట్లు * మెరుగైన మురుగునీటి పారుదల వ్యవస్థ... మురుగునీటిని తీసుకెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు... ఈ నీటిని కృష్ణాలో కలిపేముందే శుద్ధి చేసేందుకు ప్లాంట్ల నిర్మాణం * నదీ తీరం వెంబడి 8 కిలోమీటర్ల పొడవున వాటర్ ఫ్రంట్ * హెరిటేజ్ గ్రామంగా మందడం * అమరావతికి ఒక వైపు నది, మరోవైపు ఉండవల్లి గుహలు * రాజధాని మధ్యలో కూడా ప్రవహిస్తూ కనువిందు చేయనున్న నది * మాస్టర్ ప్లాన్ లో మొత్తం 32 గ్రామాలు * జాతీయ, అంతర్జాతీయ క్రీడా సంబరాలను నిర్వహించేలా స్టేడియంల నిర్మాణం