: ఏసీబీ ఎదుట తెలుగు యువత నేతలు... మరికాసేపట్లో విచారణ ప్రారంభం
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు మరో సుదీర్ఘ విచారణకు సిద్ధమయ్యారు. నిన్న ఏసీబీ నుంచి నోటీసులు అందుకున్న టీడీపీ యువజన విభాగం తెలుగు యువత నేతలు ప్రదీప్ చౌదరి, మనోజ్, సుధీర్, పుల్లారావు యాదవ్ లు కొద్దిసేపటి క్రితం బంజారా హిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కేసులో టీడీపీ యువ నేత నారా లోకేశ్ ప్రమేయాన్ని రాబట్టేందుకే ఏసీబీ అధికారులు యత్నిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. మరికాసేపట్లో ఈ నలుగురిని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. విచారణలో సంధించాల్సిన ప్రశ్నావళిని కూడా ఇప్పటికే ఏసీబీ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.