: చంద్రబాబు అనుమతిస్తే రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుంటాం: సింగపూర్ మంత్రి ఈశ్వరన్


ఏపీ రాజధాని అమరావతి బృహత్తర ప్రణాళికతో హైదరాబాద్ విచ్చేసిన సింగపూర్ బృందం... రాజమండ్రికి బయలుదేరుతోంది. ఈ సందర్భంగా సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మాట్లాడుతూ, ప్రణాళికను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పిస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించామని చెప్పారు. ఈ ప్రణాళిక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనికితోడు, ముఖ్యమంత్రి అనుమతిస్తే రాజధాని నిర్మాణంలో సైతం పాలుపంచుకుంటామని ఈశ్వరన్ తెలిపారు. ఎంతో పవిత్రమైన గోదావరి పుష్కరాల్లో పాల్గొనాలని ఎదురు చూస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News