: ఆంధ్రా భక్తులు వస్తున్నారు, జాగ్రత్తగా చూసుకోండి: కేసీఆర్ ఆదేశం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్న తొలి పుష్కరాల్లో పాల్గొనేందుకు ఆంధ్రా ప్రాంతం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, వారికి అవసరమైన రవాణా సౌకర్యాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రా నుంచి వచ్చే వారు తిరిగి వెళ్లేందుకు అవసరమైన బస్సులను వేయాలని ఆర్టీసీ ఎండీ రమణారావుకు కేసీఆర్ సూచించారు. వివిధ జిల్లాల్లో పుష్కర ఘాట్ల వద్దే ఉంటూ, ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్న మంత్రులు హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులతో మాట్లాడిన కేసీఆర్ ఘాట్ల వద్ద రద్దీని గురించి, భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు.