: జయ ఆరోగ్యంపై మాట్లాడితే నాలుక కోస్తానని బెదరించిన అన్నా డీఎంకే ఎంపీ


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై పలు రకాల వదంతులు వస్తున్న నేపథ్యంలో, ఆమె ఆరోగ్యం విషయమై ఎవరైనా మాట్లాడితే, వారి నాలుక కోస్తానని అన్నా డీఎంకే ఎంపీ సుందరం హెచ్చరించారు. నామక్కల్ జిల్లా, రాసిపురం కొత్త బస్టాండు వద్ద ప్రభుత్వ ప్రగతిని వివరిస్తూ బహిరంగ సభ జరుగగా, ఇందులో రాష్ట్ర మంత్రి తంగమణి, నామక్కల్ ఎంపీ సుందరం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూసేకరణ చట్టం ఆమోదం కోసం ప్రధాని మోదీ స్వయంగా జయలలిత మద్దతు కోరారని, ఆమె మద్దతిస్తే చట్టం సులభంగా ఆమోదం పొందుతుందని అన్నారు. జయలలితను విశ్రాంతి తీసుకోమని కొంతమంది అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిని ఊరికే వదలబోమని అన్నారు.

  • Loading...

More Telugu News