: గోదావరి నీటిలో సంకల్పం చెప్పుకుని స్నానం చేసిన గవర్నర్ దంపతులు
పవిత్ర గోదావరి పుష్కరాల ఏడవ రోజు లక్షల సంఖ్యలో యాత్రికులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తన సతీమణితో కలసి వచ్చి రాజమండ్రిలోని సరస్వతీ ఘాట్ లో పుష్కరస్నానం చేశారు. నడుములోతు ఉన్న నీటిలో దిగి సంకల్పం చెప్పుకుని, మూడుసార్లు గోదావరి నీటిలో మునిగిన ఆయన, సూర్యనమస్కారాలూ చేశారు. ఆయనకు స్వాగతం పలికిన అధికారులు గవర్నర్ దంపతుల స్నానం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ రోజు తెల్లవారుఝామున 3 గంటల నుంచి యాత్రికుల స్నానాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల వరకూ రాజమండ్రిలోని వివిధ ఘాట్లలో 5 లక్షల మందికిపైగా స్నానాలు చేసినట్టు అధికారులు వివరించారు.