: పవర్ స్టార్ డైరెక్షన్ లో చేస్తే చిరు సినిమా బాహుబలిని మించుతుందంటున్న రామ్ గోపాల్ వర్మ
మోగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ల వర్షం ఇంకా వదల్లేదు. చిరు చిత్రాన్ని ఏ ఇతర దర్శకులూ బాహుబలిని మించి తీసే అవకాశం లేదని ఆయన అభిమానులంతా భావిస్తున్నారని, తన చిత్రానికి చిరంజీవే స్వయంగా దర్శకత్వం వహిస్తే మాత్రమే అది సూపర్ హిట్టవుతుందని ట్విట్టర్లో వ్యాఖ్యానించాడు. ఒకవేళ చిరంజీవి దర్శకత్వం వహించేందుకు నిరాకరించే పక్షంలో ఆ సినిమాకు పవన్ కల్యాణ్ దర్శకత్వం వహించాలని అన్నాడు. పవన్ దర్వకత్వంలో చిరంజీవి చిత్రం వస్తే అంతకు మించిన పెద్ద సినిమా ఉంటుందా? అని తాను మెగా అభిమానులను అడుగుతున్నానని ట్విట్ చేశాడు. దీనికి రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించవచ్చని, పవర్ స్టార్ దర్శకత్వంలో మెగాస్టార్ నటనతో వస్తే ఆ చిత్రం 'మెగా బాహుబలి' అవుతుందని వివరించాడు.