: ఎమ్మెల్యే భర్త అరెస్ట్... రెండు వారాల రిమాండ్ విధించిన కోర్టు
పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత భర్త శివప్రసాద్ ను విశాఖ మూడో పట్టణ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. తాను ఇంటిలో లేని సమయంలో వచ్చి విలువైన డాక్యుమెంట్లతో పాటు తన కొడుకును కూడా అపహరించుకుని వెళ్లేందుకు శివప్రసాద్ యత్నించాడని ఎమ్మెల్యే అనిత పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె భర్త శివప్రసాద్ ను నిన్న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. శివప్రసాద్ కు న్యాయమూర్తి రెండు వారాల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు జైలుకు తరలించారు.