: స్కూటీపై తెలంగాణ డిప్యూటీ స్పీకర్!...ట్రాఫిక్ నియంత్రణలో పద్మాదేవేందర్ రెడ్డి
గోదావరి పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉప్పెనలా తరలివస్తున్నారు. దీంతో గోదావరికి దారితీసే రహదారులపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు బైకులెక్కి మరీ ట్రాఫిక్ ను నియంత్రిస్తూ భక్తులకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. నిన్న తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కూడా ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతల్లోకి దిగిపోయారు. నిన్న వరంగల్ జిల్లాకు వెళ్లిన ఆమె మంగపేట నుంచి కమలాపురం వరకు స్కూటీపై ప్రయాణించారు. అంతేకాక స్కూటీపై వెళుతూనే ఆమె ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తూ సాగారు.