: చర్లపల్లి జైల్లో ‘ఏబీఎన్’పై నిషేధం లేదు...90 శాతం మంది ఖైదీలు దాన్నే చూస్తారు: రేవంత్ రెడ్డి


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడం, తొలి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేయడం... తదితర వరుస పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం సదరు తెలుగు న్యూస్ చానెల్ పై తెలంగాణ వ్యాప్తంగా ఏడాదికిపైగా నిషేధం అమలువుతోంది. అయితే తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని చర్లపల్లి జైల్లో మాత్రం సదరు చానెల్ పై ఏమాత్రం నిషేధం లేదట. అంతేకాక ప్రభుత్వ చానెల్ దూరదర్శన్ తో పాటు ఒక్క ఏబీఎన్ చానెల్ మాత్రమే జైల్లోని టీవీల్లో వస్తుందట. 90 శాతం మంది ఖైదీలు కేవలం ఏబీఎన్ చానెల్ నే చూస్తారని ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి చెబుతున్నారు. నిన్న ఏబీఎన్ చానెల్ లో ప్రసారమైన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో రేవంత్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయం తెలంగాణ సీఎం కేసీఆర్ కు తెలిస్తే, అక్కడి నుంచి కూడా ఏబీఎన్ ను తీయించివేస్తాడేమోనని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News