: అమరావతి మాస్టర్ ప్లాన్ ను రేపు చంద్రబాబుకు సమర్పించనున్న సింగపూర్ టీమ్


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి సీడ్ క్యాపిటల్ ప్రణాళికను సింగపూర్ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేయనుంది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఆధ్వర్యంలోని టీమ్ ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకోనుంది. రేపు ఉదయం రాజమండ్రికి వెళ్లి, గోదావరి పుష్కరాల్లో ఈ బృందం పాల్గొంటుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు రాజమండ్రిలోని షెల్టన్ హోటల్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ సీడ్ క్యాపిటల్ ప్రణాళికను అందజేయనుంది. ఆ తర్వాత చంద్రబాబు, ఈశ్వరన్ లు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News