: వీఐపీలు ఎవరూ భద్రాచలం రావద్దు: మంత్రి తుమ్మల


గోదావరిలో పుష్కర స్నానం ఆచరించేందుకు వీఐపీలు ఎవరూ భద్రాచలం రావద్దని టీఎస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విన్నవించారు. భద్రాచలంకు భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉందని, ఈ క్రమంలో వీఐపీలు ఇక్కడకు వస్తే, వారికి సదుపాయాలు కల్పించడం కష్టమని స్పష్టం చేశారు. భక్తులంతా భద్రాచలం ఘాట్ కే కాకుండా... బూర్గంపాడు, మోతె తదితర ఘాట్లకు వెళ్లాలని సూచించారు. దీనికితోడు, భక్తులెవరూ కాలినడకన బ్రిడ్జ్ పైకి రావద్దని, ఉచితంగా ఏర్పాటు చేసిన బస్సులలోనే రావాలని విన్నవించారు.

  • Loading...

More Telugu News