: పుష్కర స్నానం చేసి ఆదర్శంగా నిలచిన ముస్లిం కుటుంబం
గోదావరి నదిలో పుష్కర స్నానం చేసి మత సామరస్యాన్ని చాటింది ఒక ముస్లిం కుటుంబం. వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం గంజాన్ గ్రామానికి చెందిన ఫక్రుద్దీన్ కుటుంబ సభ్యులు ఈరోజు పుష్కర స్నానం చేశారు. సోన్ పుష్కర ఘాట్ లో వారు పుష్కర స్నానం ఆచరించారు. గత పుష్కరాల్లో తమ పెద్దలు పుష్కర స్నానం చేశారని... ఈ పుష్కరాల్లో తమ పెద్దలు చేసిన దాన్ని తాము కొనసాగించామని వారు ఈ సందర్భంగా తెలిపారు.