: మీ వల్లే అమ్మ కోలుకుంటోంది: ఇషా డియోల్


బీజేపీ నేత, డ్రీమ్ గర్ల్ హేమమాలిని క్రమంగా కోలుకుంటున్నట్టు ఆమె కూతురు, నటి ఇషా డియోల్ తెలిపింది. అభిమానుల ఆశీర్వాదం, అభిమానం వల్లే అమ్మ క్రమంగా కోలుకుంటున్నారని చెప్పింది. అయితే, వెంటనే కోలుకోవడానికి అమ్మ సూపర్ ఉమన్ కాదుగా? అంది. బాలీవుడ్ నిర్మాత సుభాష్ ఘాయ్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి వచ్చిన ఇషా ఈ విషయాన్ని వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ లో హేమమాలిని కారు యాక్సిడెంట్ కు గురయిన సంగతి తెలిపిందే. ఈ ప్రమాదంలో ఆమె గాయపడగా, రెండేళ్ల చిన్నారి దుర్మరణం పాలయింది.

  • Loading...

More Telugu News