: భారత్ - జింబాబ్వే రెండో టీ20... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే
భారత్ - జింబాబ్వేల మధ్య హరారే వేదికగా రెండో టీ20 మ్యాచ్ ప్రారంభమయింది. టాస్ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టులో స్పిన్నర్ హర్భజన్ సింగ్ కు విశ్రాంతి కల్పించారు. భజ్జీ స్థానంలో సంజు శాంసన్ ను జట్టులోకి తీసుకున్నారు. దీంతో, ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో సంజు ఆరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు, జింబాబ్వే కెప్టెన్ గా సికందర్ రజా బాధ్యతలను చేపట్టాడు. మసకద్జా, చిబాంగాలు జింబాబ్వే ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. తొలి ఓవర్ ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా జింబాబ్వే 7 పరుగులు చేసింది.