: ఎక్స్ ప్రెస్ రహదారిపై రాళ్ల వాన... ముగ్గురు దుర్మరణం


దేశంలోనే ప్రసిద్ధి చెందిన ముంబై-పూణే ఎక్స్ ప్రెస్ రహదారిపై ఈ మధ్యాహ్నం రాళ్ల వర్షం కురిసింది. రహదారిలోని అదోషి టన్నెల్ వద్ద కొండ చరియలు విరిగి పడటంతో... పెద్ద ఎత్తున రాళ్లు రహదారిపై పడ్డాయి. ఈ ఘటనలో ఆ సమయంలో రోడ్డుపై వెళుతున్న ఓ కారు, మరో రెండు వాహనాలపై రాళ్లు పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. వాహనాల్లో ఉన్న ఇతరులు తీవ్రంగా గాయపడ్డారు. హైవేపై రాళ్లు గుట్టలా పేరుకుపోవడంతో, ఇరువైపుల ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ప్రస్తుతం రాళ్లను తొలగించే పనిలో యంత్రాంగం పడింది.

  • Loading...

More Telugu News