: తెలంగాణ మంత్రులు బైకులెక్కింది ట్రాఫిక్ కంట్రోల్ కోసం కాదు... ఫొటోల కోసం: వీహెచ్
గోదావరి పుష్కరాలకు సదుపాయాలు కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ముఖ్యంగా ట్రాఫిక్ వ్యవస్థ అతలాకుతలమైందని అన్నారు. టీఎస్ మంత్రులు పలువురు బైకులెక్కి ట్రాఫిక్ నియంత్రిస్తున్నట్టు పోజులిస్తున్నారని... నిజానికి వారంతా ట్రాఫిక్ నియంత్రణ కోసం బైకులెక్కలేదని, ఫొటోలకు పోజులివ్వడానికే ఈ పని చేశారని ఆరోపించారు. మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్మరరావు, ఈటెల రాజేందర్ లు బైకులెక్కి హడావుడి చేసిన నేపథ్యంలోనే వీహెచ్ ఈవిధంగా స్పందించారు.