: బీజేపీ అధినాయకత్వంతో భేటీ అయిన వసుంధర, శివరాజ్ సింగ్ చౌహాన్


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులతో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే భేటీ అయ్యారు. ఆమెతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా సమావేశమయ్యారు. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ వ్యవహారంలో వసుంధర, వ్యాపమ్ కుంభకోణంలో శివరాజ్ సింగ్ లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో, పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంలో, బీజేపీ అధినాయకత్వంతో వీరిద్దరి భేటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రానున్న పార్లమెంటు సమావేశాలు వీరిద్దరి వ్యవహారాలపై దద్దరిల్లనున్న నేపథ్యంలో, వారిద్దరి నుంచి బీజేపీ సీనియర్ నేతలు వివరణ తీసుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News