: గుంటూరు జిల్లాలో స్వల్ప భూకంపం


ఈ మధ్యాహ్నం గుంటూరు జిల్లాలో భూమి కంపించింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని శ్యావల్యాపురం మండలంలో సుమారు 3 సెకన్ల పాటు భూమి కంపించింది. మండల పరిధిలోని మతుకుమల్లి, బందులపాలెం తదితర గ్రామాల్లో ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది. భూ ప్రకంపనలు స్పష్టంగా తెలియడంతో ప్రజలు ఇళ్లల్లోంచి పరుగులు పెడుతూ బయటకు వచ్చారు. ఈ ప్రకంపనల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగినట్టు సమాచారం అందలేదు. ఎంత తీవ్రతతో భూకంపం వచ్చిందన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా, ఈ ప్రాంతంలో గతంలోనూ పలుమార్లు స్వల్ప భూకంపాలు వచ్చాయి.

  • Loading...

More Telugu News