: ది లార్డ్ ఆఫ్ రింగ్స్ లో 'ఎల్విష్' మాదిరిగా బాహుబలిలో 'కిలికి'... ఎంత కష్టపడ్డారంటే!


'కిలికి'... కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చిన సరికొత్త భాష. ఎక్కడా వినని పదాలతో నిండిన ఈ భాషను బాహుబలి చిత్రం కోసం రాజమౌళి టీం సృష్టించిన సంగతి తెలిసిందే. కిలికి భాషను తయారు చేసేందుకు ఎంతో కష్టపడ్డారట. ది లార్డ్ ఆఫ్ రింగ్స్ చిత్రంలో రాక్షస మూక మాట్లాడే 'ఎల్విష్' భాష తరహాలోనే బాహుబలిలో కాలికేయుల తెగ కిలికి భాషలో సంభాషించుకుంటుంది. ఈ భాషను ప్రవేశపెట్టే బాధ్యతలను, తమిళ వర్షన్ కు డైలాగుల ఇన్ చార్జ్ గా ఉన్న మదన్ కార్కేకు అప్పగించగా, ఆయన కష్టపడి దీన్ని తయారు చేశారట. ఈ భాష కోసం సుమారు 750 పదాలను సృష్టించిన ఆయన కాలికేయుల మూడ్ తెలిసివచ్చేలా పదాలను అల్లారు. 40 రకాల గ్రామర్ రూల్స్ పాటిస్తూ వాక్యాలను అల్లారు. ఏం మాట్లాడుతున్నారో తెలియక పోయినా, ఆ భావం ప్రేక్షకులకు సులువుగా తెలిసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కాలికేయుల తెగలో పాత్రదారులందరికీ భాషపై పట్టు కోసం ప్రత్యేక క్లాసులు తీసుకున్నారట. డైలాగులున్న నటులందరికీ, వారికి ఏ పదం ఎలా పలకాలి, దాని అర్థం తెలుగులో ఏంటన్న విషయాన్ని చెబుతూ రోజుల తరబడి ప్రాక్టీస్ చేయించారట. అందువల్లే ఈ భాష అంత ఈజీగా సినీ ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోయింది. బాహుబలిలో కాలికేయుల తెగకు నాయకుడిగా నటించిన ప్రభాకర్ చెప్పిన కిలికి డైలాగులు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అలరిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News