: టీఆర్ఎస్ కక్ష సాధించేందుకే నోటీసులు పంపిందన్న దేశం నేత


ఓటుకు నోటు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలుగుదేశం పార్టీ నేత ప్రదీప్ తెలిపారు. ఎటువంటి సంబంధం లేకున్నా ఏసీబీ నోటీసులు ఇవ్వడాన్ని చూస్తే, టీఆర్ఎస్ సర్కారు తనపై కక్ష సాధించే చర్యల్లో ఇది భాగమేనని తెలుస్తోందని ఆయన అన్నారు. నోటీసులను అందుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏసీబీ విచారణకు హాజరై, వారికి సహకరిస్తానని, తనకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు. కేసులో నిందితులుగా విచారణను ఎదుర్కొన్న సండ్ర వెంకట వీరయ్య, వేం నరేందర్ రెడ్డిలతో తనకు పరిచయాలు లేవని, అంత పెద్ద నేతను తాను కానని అన్నారు. ఏసీబీ విచారణకు హాజరై, ఆ తరువాత వారేం అడిగారన్న సంగతి మీడియాకు చెబుతానని అన్నారు.

  • Loading...

More Telugu News