: చిన్నారుల కడుపుకొడుతున్న పథకమది: కాగ్


పేద విద్యార్థులకు పోషకాహారాన్ని అందించాలన్న సదుద్దేశంతో నడుపుతున్న మధ్యాహ్న భోజన పథకం అత్యంత అవినీతి కంపు కొడుతోందని, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్వహణా లోపాలతో పథకం నిధులు పక్కదారి పడుతున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆరోపించింది. చిన్నారులకు నాణ్యతతో కూడిన భోజనం అందడం లేదని, విద్యార్థులకు వారి తల్లులతోనే వండించి పెట్టాలన్న వ్యవస్థ ఎక్కడా అమలు కావడం లేదని తెలిపింది. తాము పరిశీలించిన రాష్ట్రాల్లో ఈ స్కీము కోసం కేటాయించిన రూ. 123.29 కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్ లోని 120 పాఠశాలలను పరిశీలించగా, అందులో 86 చోట్ల అవకతవకలు వెలుగు చూశాయని తెలిపింది. ఈ పాఠశాలల్లో ఎక్కడా తల్లుల పర్యవేక్షణలో మధ్యాహ్న భోజన పథకం అమలు కావడం లేదని వివరించింది. తాము సేకరించి పరీక్షలు జరిపిన ఆహార పదార్థాల్లో 89 శాతం నాణ్యతా ప్రమాణాలు నిబంధనలకు అనుగుణంగా లేవని తెలిపింది. ఈ పథకాన్ని నిర్వహిస్తున్న ఇస్కాన్ వంటి ప్రైవేటు సంస్థలకు చెల్లింపులు సైతం అధికంగా జరిపినట్టు గుర్తించామని కాగ్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News