: ఇండియాలో గంటకు 16 మందిని బలిగొంటున్నవి ఏంటో తెలుసా?


ఇండియాలో అత్యధికుల ప్రాణాలను బలిగొంటున్నది ఏంటో తెలుసా? గుండెపోటో, క్యాన్సరో కాదు. రోడ్డు ప్రమాదాలు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ చేజేతులా తమ ప్రాణాలను, పక్కవారి ప్రాణాలను తీసేస్తున్న వారి కారణంగా 2014లో రోజుకు 16 మంది మృతి చెందారు. 2013తో పోలిస్తే గత సంవత్సరం 3 శాతం అధికంగా మొత్తం 1.41 లక్షల మంది రహదారి ప్రమాదాల్లో మరణించారు. నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం ప్రమాదాల్లో గాయపడ్డవారి సంఖ్య సైతం 2013తో పోలిస్తే 4.5 లక్షల నుంచి 4.8 లక్షలకు పెరిగింది. మొత్తం ప్రమాదాల్లో ద్విచక్ర వాహనాలు, లారీల కారణంగానే సగం మందికి పైగా మృత్యువాత పడ్డారని, 13,787 మంది టూ వీలర్ లపై ప్రయాణిస్తూ మరణించగా, ట్రక్కులు, లారీలూ ఢీకొని 23,529 మంది మరణించారని, 1.4 లక్షల మంది మృత్యువుకు దగ్గరగా వెళ్లి వచ్చారని తెలిపింది. అతి వేగం, ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్ టేక్ చేయడం కారణంగా 1.7 లక్షల యాక్సిడెంట్లు జరిగాయని, వాటిల్లో 49 వేల మంది మరణించారని తెలిపింది. యూపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో 40 శాతం వాహన ప్రమాదాలు జరిగాయని, మెట్రోల విషయానికి వస్తే ఢిల్లీ ముందు నిలిచిందని తెలిపింది.

  • Loading...

More Telugu News