: మరో విదేశీ టూర్... నెహ్రూ తరువాత అక్కడికి వెళుతున్న తొలి ప్రధాని మోదీయే!


ప్రధాని నరేంద్ర మోదీ మరో విదేశీ ప్రయాణానికి సన్నద్ధమవుతున్నారు. ఈ దఫా ఆయన కన్ను ప్రపంచ ఐటీ కేంద్రం సిలికాన్ వ్యాలీ మీద పడింది. సెప్టెంబరులో ప్రధాని హోదాతో అమెరికాలో రెండో విడత పర్యటించనున్న మోదీ కాలిఫోర్నియా వెళ్లి, సిలికాన్ వ్యాలీని సందర్శించనున్నారు. 1949లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, తన భార్య విజయలక్ష్మీ పండిట్, కుమార్తె ఇందిరాగాంధీలు సహా కాలిఫోర్నియాలో పర్యటించారు. ఆ తరువాత మరే భారత ప్రధానీ అక్కడ పర్యటించలేదు. కాగా, కాలిఫోర్నియాకు, భారత్ కు ఎంతో అనుబంధం ఉంది. బ్రిటీషు వారిని ఇండియా నుంచి తరిమికొట్టడమే లక్ష్యంగా గదార్ పార్టీ పుట్టింది కాలిఫోర్నియా యూనివర్శిటీలోనే. లాలా హర్ దయాళ్, మహమ్మద్ బర్కతుల్లా, తారక్ నాద్ దాస్ ఇక్కడ చదువుతూనే స్వాతంత్ర సంగ్రామానికి ఆకర్షితులయ్యారు. స్వాతంత్ర్య సమర యోధులు లాలా లజపత్ రాయ్, మానబేంద్రనాథ్ రాయ్ (ఎం.ఎన్. రాయ్)లు అక్కడే విద్యను అభ్యసించారు.

  • Loading...

More Telugu News