: రూ. 90 కోట్లతో 'సైడ్ బిజినెస్' ప్రారంభించిన విరాట్ కోహ్లీ


దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, వివిధ ఆటలను ఆడే ప్రముఖ క్రీడాకారులు 'సైడ్ బిజినెస్' చేసుకోవడం కొత్తేమీ కాదు. తాజాగా ఈ జాబితాలో భారత క్రికెట్ టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేరిపోయాడు. సుమారు రూ. 90 కోట్లను వెచ్చిస్తూ 'చిసెల్' పేరిట జిమ్నాజియం చైన్ ను ప్రారంభించాడు. 26 ఏళ్ల విరాట్ కోహ్లీ గత సంవత్సరం 'రోగ్న్' పేరిట దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇండియన్ సూపర్ లీగ్ లో భాగంగా ఫుట్ బాల్ ఫ్రాంచైజీ ఎఫ్సీ గోవా ను కూడా కొనుగోలు చేశాడు. ఇక మరో క్రికెటర్, ఈ సంవత్సరం ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచిన యువరాజ్ సింగ్, స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నాడు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న లాజిస్టిక్స్ బుకింగ్ సంస్థ 'మూవో', మొబైల్ బ్యూటీ అండ్ వెల్ నెస్ ప్లాట్ ఫాం 'వ్యోమో', విద్యారంగంలో సేవలందిస్తున్న 'ఎడ్యుకార్ట్' తదితర కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేశాడు. ఇక ధోనీ విషయానికి వస్తే, తాను ప్రారంభించిన 'స్పోర్ట్స్ ఫిట్' జిమ్ చైన్ ను వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా విస్తరించాలన్న కంకణం కట్టుకున్నాడు. ఇందుకోసం రూ. 2000 కోట్లను పెట్టుబడిగా పెట్టాలని ప్రణాళికలను రూపొందించుకున్నాడు.

  • Loading...

More Telugu News