: బొత్స రాకతో భ్రష్టు పట్టిన రాజకీయాలు: తెదేపా నిప్పులు
బొత్స సత్యనారాయణ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత రాజకీయాలే భ్రష్టు పట్టాయని తెలుగుదేశం నేత కళా వెంకట్రావు తీవ్ర విమర్శలు చేశారు. గతంలో జగన్ ను విమర్శించిన ఆయన ఇప్పుడు ఆయన పార్టీలోనే ఎందుకు చేరారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం సోనియా కాళ్ల చుట్టూ తిరగలేదా? అని బొత్సను ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత డబ్బు కూడబెట్టుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. పలు కేసుల్లో వైఎస్ సాయపడితే, బయటపడ్డ ఆయన, ఆ రుణం తీర్చుకునేందుకు మాత్రమే ఇప్పుడు జగన్ పంచన చేరారని దుయ్యబట్టారు.