: 'బాహుబలి' బాగాలేదన్నా రాజమౌళిపై నమ్మకంతో చూశా: తమిళ దర్శక నిర్మాత లింగుస్వామి
ప్రముఖ తమిళ దర్శక నిర్మాత లింగుస్వామి 'బాహుబలి' చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాట బాహుబలి బృందం విలేకరుల సమావేశం నిర్వహించగా, ఆయన పాల్గొని మాట్లాడారు. సినిమా విడుదలైన తరువాత హైదరాబాదులోని తన మిత్రుడిని చిత్రం ఎలా వుందని అడిగితే, బాగోలేదనట్టు చెప్పాడని, తాను మాత్రం రాజమౌళిపై ఉన్న అపార నమ్మకంతో చిత్రం చూశానని వివరించారు. బాహుబలిలో ప్రతి సన్నివేశం తనను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిందని చెప్పారు. ఈ తరహా చిత్రాలను తాను హాలీవుడ్ లోనే చూశానని, ఇటువంటి ఇండియన్ సినిమా వస్తుందని అనుకోలేదని అన్నారు. ఇదో దృశ్యకావ్యమని అభివర్ణించారు.