: సల్మాన్... మా ఇంట్లో పిల్లలకు కాస్త బిర్యానీ పంపించు: షారూఖ్
ఒకప్పుడు బద్ధశత్రువులుగా ఉన్న షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు గత కొంత కాలంగా మంచి మిత్రులైపోయారు. ఇటీవల సల్మాన్ కొత్త చిత్రం 'బజరంగీ భాయిజాన్'ను షారూఖ్ పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు షారుఖ్ సినిమా రాయీస్ గురించి సల్మాన్ ప్రచారం చేస్తున్నాడు. తాజాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా "రాయీస్ వస్తున్నాడు. టీజర్ చూసి ఎంజాయ్ చేయండి" అని సల్మాన్ ట్వీట్ చేయగా, దానికి షారూఖ్ చమత్కారంగా ప్రతిస్పందించాడు. "నేను ఇప్పుడు రాలేను. బల్గేరియాలో ఉన్నాను. ఇంట్లో పిల్లలున్నారు. కొద్దిగా బిర్యానీ మా ఇంటికి పంపించు. మీకు, మీ కుటుంబానికి రంజాన్ శుభాకాంక్షలు" అని ట్వీట్ చేయడం విశేషం.