: మహేష్ బాబుతో దేవిశ్రీప్రసాద్ ఆసక్తికర సంభాషణ
'శ్రీమంతుడు' సినిమా ఆడియో వేడుకలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. అభిమానుల తరపున మహేష్ బాబును రెండు ప్రశ్నలు అడగాలనుకుంటున్నానని చెప్పిన దేవిశ్రీప్రసాద్, 'అంత అందంగా ఎలా ఉంటారు?' అని అడిగాడు. దీనికి నవ్వేసిన మహేష్ బాబు...'అది నాకెలా తెలుస్తుంది? మీరే చెప్పాల'ని తప్పించుకున్నాడు. తాను చాలా మందిని కలుస్తుంటానని, కొంత మందికి అద్భుతమైన టాలెంట్ ఉంటుందని, కానీ ఏం చేయాలో తెలియదని, అలాంటి వాళ్లకు మీరేం చెబుతారని ప్రశ్నించాడు. దానికి మహేష్ బాబు సమాధానమిస్తూ, 'మనసుకి ఏది సరైనది అనిపిస్తే అది చేసేయండి' అని సలహా ఇచ్చాడు. ఈ సందర్భంగా సినిమాలో తన తండ్రితో జరిగే సంభాషణ సందర్భంగా జరిగే ఓ డైలాగ్ ను గుర్తు చేశాడు. "నాన్నా మీరేం కావాలనుకున్నారో అదయ్యారు. నేనేం చెయ్యాలనుకుంటున్నానో అది చేయనివ్వండి" అని అన్నాడు. అంతకు ముందు దేవిశ్రీ... శృతి హాసన్ తో సందడి చేశాడు.