: ట్రైలర్ స్పూర్తిమంతంగా ఉంది...చాలా ధైర్యం కావాలి: శ్రీకాంత్ అడ్డాల


సమస్య వస్తే ఇతనంత దీటుగా ఎదుర్కోవాలి అనిపించే వ్యక్తి మహేష్ బాబు అని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపాడు. హైదరాబాదులోని శిల్పకళా వేదికపై జరిగిన ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, 'శ్రీమంతుడు' ట్రైలర్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతుందో తెలిసిపోతుందని అన్నాడు. ట్రైలర్ లోని సామాజిక అంశాన్ని చూపించడం అనేది ఎంతో ధైర్యం కలిగిన అంశమని, దానిని చూపించడానికి ఎంతో ధైర్యం కావాలని శ్రీకాంత్ అడ్డాల తెలిపాడు. ఈ ఆడియో వేడుక ద్వారా తనకు మంచి అవకాశం కలిగిందని, చిన్నోడు, పెద్దోడిని ('సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో మహేష్, వెంకటేష్) ఈ రకంగా కలిశానని చమత్కరించాడు. సినిమా అద్భుతమైన విజయం సాధించాలని ఆకాంక్షించాడు. పాటలు అద్భుతంగా ఉన్నాయని శ్రీకాంత్ చెప్పాడు.

  • Loading...

More Telugu News