: గంటకో కిలోమీటర్... మందకొడిగా సాగుతున్న ట్రాఫిక్


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రహదారులన్నీ గోదావరి నదీతీరానికి దారితీస్తున్నాయి. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో గోదావరి పుష్కరాలకు జనం పోటెత్తారు. దీంతో గోదావరికి దారితీసే రోడ్లన్నీ జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. రాజమండ్రిలోని నాలుగో బ్రిడ్జిపై కిలోమీటర్ల మేర వాహనాలు ఆరు గంటల నుంచి ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా ఇల్లెందు నుంచి పాల్వంచకు 8 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దూరం దాటేందుకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతోంది. ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నప్పటికీ యాత్రికుల రద్దీ పెరగడంతో రహదారులన్నీ దిగ్బంధమయ్యాయి. ఉభయగోదావరి జిల్లాల ప్రజలు ట్రాఫిక్ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటకో కిలో మీటర్ ప్రయాణించాల్సి వస్తోందంటే ట్రాఫిక్ ఏ రీతిగా ఉందో అందరూ అంచనా వేయవచ్చు.

  • Loading...

More Telugu News