: పూంఛ్ సెక్టార్ లో పాక్ బలగాల కాల్పులు... ఇద్దరు మహిళలకు గాయాలు


సరిహద్దు దేశం పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. జమ్ము కాశ్మీర్ లోని పూంఛ్ సెక్టార్ వద్ద ఆ దేశ సైనికులు కాల్పులు జరిపారు. సరిహద్దు వద్ద 2 గ్రామాల లక్ష్యంగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. భారత సైనికులు కాల్పులను తిప్పికొట్టారు. ఈరోజు పాక్ కాల్పులకు పాల్పడటం ఇది రెండవసారి.

  • Loading...

More Telugu News