: పుష్కరాలకు వెళుతూ ట్రాఫిక్ లో చిక్కుకున్న వీహెచ్
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పుష్కరాలకు వెళుతూ ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. కాళేశ్వరం వెళుతుండగా మహదేవ్ పూర్ వద్ద ఆయన వాహనం ట్రాఫిక్ కారణంగా ముందుకువెళ్లలేక నిలిచిపోయింది. దాంతో, ఆయనలో అసహనం పెల్లుబికింది. పుష్కర ఏర్పాట్లు సరిగా చేయడంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విఫలమయ్యారని చిర్రుబుర్రులాడారు. ఇద్దరు చంద్రులు ప్రచారంపై శ్రద్ధ పెట్టారే తప్ప, ఏర్పాట్ల గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు.