: కన్నీళ్లు పెట్టిన ప్రత్యూష... ఏడ్వొద్దమ్మా! నీకేం కాదు, నేనున్నానంటూ కేసీఆర్ భరోసా


బంధువులందరూ ఉన్నా అనాథలా మారిన ప్రత్యూష సీఎం కేసీఆర్ తో తన అంతరంగాన్ని పంచుకుంది. సవతి తల్లి, కన్నతండ్రి పెట్టిన చిత్రహింసలను ఆయనకు వివరించింది. వారి దురాగతాలు కలల్లోకి వస్తున్నాయంటూ ఆ అభాగ్యురాలు కంటతడి పెట్టగా సీఎం కేసీఆర్ చలించిపోయారు. 'ఏడ్వొద్దమ్మా! నీకేం కాదు, నేనున్నా'నంటూ అనునయించే ప్రయత్నం చేశారు. కన్నబిడ్డలా చూసుకుంటానని భరోసా ఇచ్చారు. కేసీఆర్ తన భార్య శోభ, కుమార్తె కవిత తదితరులతో ఎల్బీనగర్ గ్లోబల్ అవేర్ ఆసుపత్రికి వెళ్లి ప్రత్యూషను పరామర్శించారు. ఈ సందర్భంగానే ప్రత్యూష సీఎం ముందు తన ఆవేదన వెలిబుచ్చింది.

  • Loading...

More Telugu News