: నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి చేరిన బంగారం ధర


బంగారం ధర నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి చేరింది. ఈరోజు రూ.250 తగ్గిన పసిడి ధర బులియన్ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.26,000కు చేరింది. ఇక వెండి ధర కూడా రూ.250 తగ్గి కేజీ ధర రూ.34,350లు పలుకుతోంది. ప్రపంచస్థాయి మార్కెట్లు బలహీనపడటం, దేశీయ మార్కెట్లో వినియోగదారులు, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో డిమాండ్ తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News