: విజయ్ మాల్యా విమానం తుక్కుతుక్కైపోయింది


ఓడలు బళ్లు అవడం అంటే ఇదేనేమో...నిన్నటి వరకు ఎక్కడెక్కడో విహరించిన విజయ్ మాల్యా విమానం తుక్కుతుక్కైపోయింది. విజయ్ మాల్యా సకల సౌకర్యాలతో మునిగి తేలినప్పుడు ఆయన దగ్గర 11 సీట్ల సామర్థ్యం కలిగిన జెట్ విమానం ఉండేది. ఆయన ఎక్కడికి వెళ్లినా దీనిలోనే ప్రయాణించేవారు. మాల్యా విడుదల చేసే కింగ్ ఫిషర్ క్యాలెండర్ కు పని చేసిన మోడల్స్ ను కూడా ఇదే మోసింది. ఏవియేషన్ రంగంలో కుదేలైపోయిన అనంతరం విజయ్ మాల్యా ఈ విమానాన్ని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిపేశారు. దీనిని వినియోగించడం, మెయింటెనెన్స్ చేయడం మానేశారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి చెల్లించాల్సిన బకాయిలు తడిసి మోపెడయ్యాయి. దీంతో ముంబై విమానాశ్రయం దీనిని వేలం వేసింది. సైలెంట్ ఎంటర్ ప్రైజెస్ దీనిని 22 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే, తరువాత దీనిని ఏం చేయాలో తోచని సంస్థ, తుక్కుగా మార్చేయాలని నిర్ణయించింది. దీంతో ఆ విమానం కిటికీలు, సీట్లు, కేబుళ్లు, ఇతర ప్యానెళ్లు అన్నీ తొలగించేశారు. కేవలం డొక్కుగా తయారు చేశారు. ఇలా చేస్తే ఆ విమానం నుంచి ఆరు టన్నుల తుక్కు వచ్చిందని సైలెంట్ ఎంటర్ ప్రైజెస్ తెలిపింది. దీనిని కేజీల లెక్కన అమ్మేసినట్టు ఆ సంస్థ వెల్లడించింది.

  • Loading...

More Telugu News