: సీఎం కేసీఆర్ కు ఎంపీ దేవేందర్ గౌడ్ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీడీపీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ లేఖ రాశారు. తెలంగాణలో పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను పెంచాలని సీఎంను కోరారు. ఇప్పటికే జిల్లాల సంఖ్యను పెంచాలని కేసీఆర్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 10 జిల్లాలున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్య నియోజకవర్గాలను జనాభా ప్రాతిపదికతో కలిపి జిల్లాలుగా మార్చాలని గతంలో ప్రభుత్వం కసరత్తు కూడా చేసింది.