: ప్రియాంక చోప్రాను సర్ ప్రైజ్ చేసిన తల్లి
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను ఆమె తల్లి మధు చోప్రా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ప్రియాంక చోప్రా నేడు 33వ పుట్టిన రోజు చేసుకుంటోంది. నిన్న మామూలుగా షూటింగుకి వెళ్లిపోయింది. షూటింగ్ ముగించి అలసిపోయి అర్ధరాత్రి ఇంటికి చేరుకుంది ప్రియాంక. ఇంట్లో అడుగు పెట్టిన ప్రియాంక సంభ్రమాశ్చర్యాలకు గురైంది. ఇంట్లో పరిణీతి చోప్రా, జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్, కంగనా రనౌత్, రణ్ వీర్ సింగ్, అర్పిత ఖాన్ శర్మ, ఆయుష్ శర్మ, అనురాగ్ కశ్యప్, సంజయ్ లీలా భన్సాలీ, విశాల్ భరద్వాజ్, కృషిక లుల్లా వంటి మిత్రులంతా ఉండడంతో ఆనందాశ్చర్యాలకు గురైంది. కుమార్తె పుట్టిన రోజు వేడుకలను స్నేహితులందరి మధ్యన జరపాలని భావించిన ఆమె తల్లి, ప్రియాంకకు తెలియకుండా ఆమె స్నేహితులందర్నీ ఇంటికి ఆహ్వానించారు. ఇది తాను ఊహించలేదని ప్రియాంక ఆనందపడిపోతూ చెప్పింది. ఆ ముచ్చటను ఆమె చెల్లి పరిణీతి చోప్రా సెల్ఫీ తీసి ట్వీట్ చేసింది.