: బొమ్మ తలలతో శిక్షణ ఇచ్చి ఇప్పుడు సైనికాధికారి పీక కోయించారు!


ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు తాజాగా ఓ చిన్నారితో సైనికాధికారి పీక కోయించి ఆ వీడియోను ఆన్ లైన్ లో పోస్టు చేసింది. తమ శిక్షణ శిబిరాల్లో చిన్నారులను కూడా చేర్చుకుంటున్న ఐఎస్ వారికి పలు పోరాట విద్యల్లో తర్ఫీదునిస్తోంది. అంతేగాకుండా, బొమ్మ తలలు నరకడంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో రక్తపిపాస కలిగేట్టు చేస్తోంది. ఈ విధంగా శిక్షణ పూర్తి చేసుకున్న బాలుడిని టెర్రర్ స్క్వాడ్ లో చేర్చుకున్నారు. ఇటీవలే తాము బందీగా పట్టుకున్న సిరియా సైనికాధికారి పీకను ఇప్పుడా బాలుడితోనే కోయించారు. సిరియా ఆర్మీ ఆఫీసర్ ను పెడరెక్కలు విరిచి కట్టి కింద పడుకోబెట్టగా, బాలుడు అతని జట్టు పట్టుకుని, తలను వెనక్కి వంచి, ఆపై పీకను నేర్పుగా కోశాడట. ఓ చేతిలో కత్తి, మరో చేతిలో మొండెం నుంచి వేరైన తలను ఆ బాల మిలిటెంట్ పట్టుకుని ఉన్న ఫొటోలు అంతర్జాతీయ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. సిరియాలోని హామ్స్ ప్రావిన్స్ లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News